![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -18 లో.... శంకర్, శారదా కలిసి నందు పెళ్లిపత్రిక ఇవ్వడానికి శాంతి ఇంటికి వెళ్తారు. నా కొడుకుని కాదని వేరొకరికి ఇస్తున్నావ్ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావని తాంబూలం విసిరేస్తుంది శాంతి. అప్పుడే మురళి, సూర్య వస్తారు. అక్క నేను చెప్పేది విను అని శంకర్ అంటున్నా కూడా అసలు శాంతి ఊరుకోదు.. నన్ను నా కొడుకుని బాధ పెట్టినవాళ్ళు బాగుపడరని మట్టి పోస్తూ శాపనార్ధాలు పెడుతుంది. నీ కూతురు పెళ్లి ఆగిపోవాలని శాంతి అంటుంది. దాంతో శంకర్, శారద బాధగా ఏడుస్తూ అక్కడ నుంచి బయల్దేరతారు. అంకుల్ నేను డ్రాప్ చేస్తానని సూర్య అంటాడు. కానీ శంకర్ అతని మాటలు పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్తారు.
మరొకవైపు నందు, గౌతమి, కిన్నెర వాళ్ళు పెళ్లిపత్రిక చదువుతారు. అసలు ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా ఇంతవరకు ఒకసారి కూడా ఫోన్ చెయ్యలేదని పెద్దావిడ అంటుంది. ఇప్పుడు చేస్తాడు చూడు అని నందు అనగానే అప్పుడే అరవింద్ ఫోన్ చేస్తాడు. మొదట కిన్నెర, గౌతమి ఆటపట్టిస్తారు. ఇక నందు ఫోన్ లాక్కొని బయటకు వెళ్లి మాట్లాడుతుంది. ఆ తర్వాత శంకర్, శారద, సూర్య ఇంటిముందుకు వచ్చి కూర్చొని బాధపడుతారు. అప్పుడే నందు, జానూ బయటకు వచ్చి ఏమైందని అడుగుతారు. ఏం లేదని శంకర్ అంటాడు. నాన్న నీ షర్ట్ పై ఈ మట్టి ఏంటని జానూ అడుగుతుంది. చూసుకోకుండా పడ్డానని శంకర్ అంటాడు. ఏంట్రా కూతురికి పెళ్లి అవుతుందని కళ్ళు నెత్తిన పెట్టి నడుస్తున్నావా అని పెద్దావిడ అంటుంది. ఆపండి అత్తయ్య అని శాంతి మాట్లాడిన మాటలు గురించి శారదా చెప్తుంది.
దాంతో జానూ కోపంగా వెళ్తుంటే ఎక్కడికి అని శంకర్ అడుగుతాడు. అత్త ఇంకొకసారి మీ జోలికి రాకుండా చేస్తానని జానూ అనగానే అవసరం లేదు అక్కడ నా అక్క.. నువ్వు తనని ఏం అన్నా ఊరుకోనని శంకర్ అంటాడు. ఈ విషయం మర్చిపోండి అని శంకర్ లోపలికి వెళ్తాడు. ఇదంతా జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావని సూర్యని జానూ అడుగుతుంది. అక్కడే ఉన్నానని సూర్య చెప్పగానే మరి నాకు ఎందుకు చెప్పలేదని కోప్పడుతుంది. ఇలాగే ఆవేశపడుతారని చెప్పలేదని సూర్య చెప్తాడు. జానూ డల్ గా ఉంటే సూర్య తనని తన మాటలతో నవ్విస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |